ipl: కాసేపట్లో చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రారంభం.. స్టేడియం వద్దకు దూసుకొస్తోన్న ఆందోళనకారులు

షార్ట్స్‌లో చూడండి
చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించకూడదని డిమాండ్ చేస్తోన్న తమిళనాడు 'కావేరీ' నిరసనకారులు కాసేపట్లో ప్రారంభం కానున్న చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో 4 వేల మంది భద్రతా బలగాలను మోహరించినప్పటికీ స్టేడియాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు.

భద్రత వలయాన్ని ఛేదించుకుంటూ ఆందోళనకారులు స్టేడియం వద్దకు దూసుకెళ్లడంతో వారిలో కొంత మందిని అరెస్టు చేసిన పోలీసులు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. స్టేడియం గేట్ల వద్ద ఐపీఎల్‌ పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి వెళ్లనిస్తున్నారు. ఆందోళనకారులు అక్కడికి చేరుకుంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతుండడంతో ఉద్రిక్తత నెలకొంటోంది.
Go Back to Shorts
ipl
chennai
Cricket

More Telugu News