ఆ అంశం పవన్ కల్యాణ్‌లో మాకు బాగా నచ్చింది: సీపీఐ రామకృష్ణ
- పవన్ వాపపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు
- వామపక్ష పార్టీలు పేదల కోసం పనిచేస్తాయి
- త్యాగాలకు సిద్ధంగా ఉంటాం
- అందుకే మేము పవన్‌తో చేతులు కలిపాం
ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. కాగా, ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించలేమని, తాము మోదీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళతామని అన్నారు. ఏపీలో తమ పార్టీకి మెరుగైన భవిష్యత్ ఉందని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.