భార్యకు పెళ్లి రోజు అభినందనలు తెలిపిన షమీ... ఆమెకంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భార్యకు పెళ్లి రోజు అభినందనలు తెలిపిన షమీ... ఆమెకంత సీన్ లేదంటున్న ఫ్యాన్స్!

  • 4వ పెళ్లి  రోజు శుభాకాంక్షలు చెప్పిన షమీ
  • కేక్ పిక్చర్ పోస్టు చేస్తూ 'మిస్ యూ' అని వ్యాఖ్య
  • ఆమెకంత వ్యక్తిత్వం లేదంటున్న షమీ ఫ్యాన్స్
తన సతీమణి హసీన్ జహాన్ ను క్రికెటర్ మహమ్మద్ షమీ ఇప్పటికీ ప్రేమిస్తున్నాడా? ఇన్ స్టాగ్రామ్ లో ఆయన చేసిన పోస్టు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తనను ద్వేషిస్తూ, నడిరోడ్డుపై నిలిపి, పరువు తీసే ప్రయత్నాలు చేసిన హసీన్ ను తానింకా అభినందిస్తున్నాననే సంకేతాలను పంపుతూ, తమ 4వ పెళ్లిరోజు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు చెప్పాడు షమీ.

ఓ పెద్ద కేక్ బొమ్మను పోస్టు చేస్తూ, "నా బెబోకు నాలుగవ వివాహ వార్షికోత్సవ కేక్. మిస్ యూ" అని మెసేజ్ పెట్టాడు. ఇక ఈ పోస్టు పెట్టిన తరువాత, నీ నుంచి అభినందనలు అందుకోవాల్సినంత గొప్ప క్యారెక్టర్ ఏమీ హసీన్ కు లేదని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆమెకు అంత సీను లేదని, విషెస్ చెప్పాల్సినంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది కాదని ట్రాల్ చేస్తున్నారు.

కాగా, గత నెల 6వ తేదీన సోషల్ మీడియా వేదికగా, హసీన్ జహాన్ పోస్టులు పెడుతూ, తన భర్తకు పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని, తనను హింసించాడని, తమ్ముడితో రేప్ చేయించాలని చూశాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Mohammad Shami
Hasin Jahan
Instagram

More Telugu News