ఢిల్లీలో నిరాహార దీక్ష చేసే ముందు కడుపు నిండా పూరీలు తిన్న కాంగ్రెస్ నేతలు.. ఫొటోలు
- ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఖండిస్తూ కాంగ్రెస్ నిరాహార దీక్ష
- ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పాల్గొన్న రాహుల్ గాంధీ
- అంతకు ముందు హోటల్‌లో టిఫిన్ తిన్న కొందరు నేతలు
కాగా, ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌లో నిరాహార దీక్షకి వెళ్లే ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు హోటల్‌లో పూరీలు తింటూ మీడియాకు చిక్కారు. ఈ ఫొటో బయటకు రావడంతో కాంగ్రెస్ నేత అరవింద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... తాము చేసేది ఒక్కరోజు దీక్ష అని, ఈ రోజు ఉదయం 10.30 నుంచి సాయత్రం 4.30 వరకు ఉంటుందని, తాము ఉదయం 8 గంటల ముందే తింటే తప్పేంటని అన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని సమర్థవంతంగా పాలించే అంశంపై దృష్టి పెట్టకుండా, తాము ఏం తింటున్నామనే విషయంపై దృష్టి పెట్టారని విమర్శించారు.