Narendra Modi: నరేంద్ర మోదీ ! నువ్వు కఠిన శిలవి..నీకు ప్రేమించే గుణం లేదు: జేసీ దివాకర్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దు. మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అవసరమైతే రాజీనామాలు చేస్తాం. కానీ, రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ఐదుగురు రాజీనామాలు చేసినా, ఏడుగురు రాజీనామాలు చేసినా ఏం ఉపయోగం లేదు. నరేంద్ర మోదీ అనేటువంటి వాడు కఠిన శిల, స్పందించే హృదయం లేదు. ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవు. ఆ పద్ధతిలో అతను  పెరగలేదు. ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాధాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి (మోదీ) తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన పారేశావు, ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు..టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు..ప్రేమను స్వీకరించు!’ అని మోదీకు ఆయన సూచించారు.
Go Back to Shorts
Narendra Modi
jc diwakar reddy

More Telugu News