కర్ణాటక ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల

  • ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
  • 72 మంది అభ్యర్థులతో తొలి జాబితా 
  • 150 స్థానాల్లో విజయం సాధించేందుకు బీజేపీ కసరత్తు
కర్ణాటక అసెంబ్లీకి మే 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ 72 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్, అనంత్ కుమార్, యడ్యూరప్ప హాజరయ్యారు.  ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి తొలి జాబితాను విడుదల చేశారు. కాగా, జేడీఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లలో విజయం సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోందని, ఈ మేరకు యడ్యూరప్పకు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
Go Back to Shorts
Karnataka
bjp

More Telugu News