Chandrababu: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఓ లేఖ రాశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తాము రాలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఈ లేఖ  రాశారు. ప్రచారం కోసమే ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని, విపక్షాలు దూరంగా ఉండటానికి చంద్రబాబు వైఖరే కారణమని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కూడా ఎంపీల ధర్నాలు, సైకిల్ ర్యాలీలు చేస్తున్నారని ఇదంతా చౌకబారు ప్రచారం కోసమేనని, అసెంబ్లీలో ప్రతిపక్షం ఈవిధంగా వ్యవహరిస్తే సహిస్తారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ మెట్లకు మొక్కి సభను అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆ లేఖలో విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
vishnukumar raj

More Telugu News