సందేశాలను ట్రాక్ చేస్తోందన్న ఆరోపణలపై స్పందించిన వాట్సాప్

  • ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉంటుంది
  • సందేశాలను మేం ట్రాక్ చేయడం లేదు
  • యూజర్ల భద్రత, గోప్యత మాకు ముఖ్యమని స్పష్టీకరణ
మెస్సేజ్ లను ట్రాక్ చేస్తోందంటూ తనపై వచ్చిన ఆరోపణలను సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్ ఖండించింది. తాము చాలా స్పల్ప డేటానే సేకరించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రతీ సందేశం కూడా ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్లే వరకూ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్ట్ చేసి ఉంటుందని, దాన్ని ఇతరులు చూసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. వాట్సాప్ ను మన దేశంలో 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

 భద్రతా రీత్యా ఇది అంత సురక్షితం కాదంటూ వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. యూజర్లు ఇతరులకు పంపించే సందేశాలను తాము ట్రాక్ చేయడం లేదని తెలిపింది. యూజర్ల గోప్యత, భద్రత తమకు ముఖ్యమని వాట్సాప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, అమెరికాకు చెందిన మెటాడాటా సంస్థ మాత్రం కాల్స్ కు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ సేకరిస్తుందన్న సందేహాలను వ్యక్తం చేసింది.
Go Back to Shorts
whatsapp
data

More Telugu News