పవన్ కల్యాణ్ తీరు 'సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువ’ అన్నట్టుగా ఉంది!: వైఎస్ జగన్ విమర్శలు
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ తీరు 'సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువ’ అన్నట్టుగా ఉంది!: వైఎస్ జగన్ విమర్శలు

  • ప్రత్యేకహోదా సాధన కోసం పవన్ ఏ కార్యక్రమాలు చేపట్టారు?
  • నాలుగేళ్లుగా ‘జనసేన’ నేత పవన్ ఏం చేశారు?
  • పవన్ మేధావితనానికి ఇదే నిదర్శనం! 
ఏపీకి ప్రత్యేకహోదా సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ కార్యక్రమాలు చేపట్టారని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం జరుగుతుంటే గత నాలుగేళ్లుగా టీడీపీ మిత్రపక్షమైన ‘జనసేన’ నేత పవన్ ఏం చేశారు? ఏ ధర్నాలు, దీక్షలు, కార్యక్రమాలు చేపట్టారు? అని ప్రశ్నించారు.

అప్పుడప్పుడు ఓ ట్వీట్ చేయడం, లేకపోతే ప్రెస్ మీట్స్ నిర్వహించి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడటం తప్పా పవన్ చేసిందేమీ లేదని అన్నారు. ‘సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువ’ అన్నట్టుగా పవన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ బీజేపీ, చంద్రబాబుతో పవన్ జతకట్టారని, ఏపీని ముంచింది బీజేపీ, బాబే అని నేడు అంటున్నారని.. పవన్ మేధావితనానికి ఇదే నిదర్శనమని అన్నారు.  
Jagan
Pawan Kalyan

More Telugu News