వడోదరలో సామూహిక వివాహ వేడుక.. పెళ్లి చేసుకున్న 542 జంటలు

  • మహేంద్ర జాసాభాయ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వివాహాలు
  • ముఖ్య అతిథిగా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ
  • కొత్త జంటలకు ఉచితంగా సామగ్రి
గుజరాత్‌లోని వడోదరలో మహేంద్ర జాసాభాయ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో 542 జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఓ పండుగలా జరిపిన ఈ వేడుకలో ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్ని మతాల జంటలు ఇందులో ఉన్నాయి. ఈ సామూహిక వివాహాల కోసం వధూవరుల కుటుంబాలు ఎటువంటి ఖర్చూ చేయలేదు. అన్ని ఖర్చులను సదరు ట్రస్ట్ సిబ్బందే పెట్టుకోవడంతో పాటు కొత్త కాపురానికి కావాల్సిన సామగ్రిని కూడా జంటలకు అందించింది. ఈ జంటల్లో నలుగురు వికలాంగులు కూడా ఉన్నారని, వారికి తమ రాష్ట్ర సీఎం విజయ్‌రూపానీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడండి... 
Go Back to Shorts
marriage
Gujarath
vijay rupani

More Telugu News