ఏ ఒక్క నాథుడూ ఢిల్లీలో స్పందించట్లేదు!: ఎంపీ రామ్మోహన్ నాయుడు
Add ap7am to your home Screen

ఏ ఒక్క నాథుడూ ఢిల్లీలో స్పందించట్లేదు!: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు
  • లోక్ సభ స్పీకర్ రెండు నిమిషాలు కూడా మాకు కేటాయించట్లేదు
  • మేము పార్లమెంట్ సభ్యులము కాదా?
ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే ఢిల్లీలో ఏ ఒక్క నాథుడూ తమ మాట వినడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ స్పీకర్ ఛాంబర్ లో టీడీపీ ఎంపీల దీక్షను భగ్నం చేస్తూ, వారిని బలవంతంగా మార్షల్స్ బయటకు తీసుకొచ్చి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద వదిలేశారు. అనంతరం, మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని, కనీసం, లోక్ సభ స్పీకర్ కూడా తమ మాట వినడం లేదని, రెండు నిమిషాల సమయం కూడా కేటాయించడం లేదని విమర్శించారు.

స్పీకర్ తమకు సమాధానమివ్వాలంటూ ఆమె ఛాంబర్ లో నిరసన తెలియజేస్తుంటే, మార్షల్స్ వచ్చి తమను బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారని మండిపడ్డారు. ‘మేము పార్లమెంట్ సభ్యులము కాదా? ఏపీ సమస్యలను ఇక్కడ చెప్పే అవకాశం మాకు లేదా? 29 రోజుల నుంచి మేము పోరాడుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Telugudesam
mp ram mohan naidu

More Telugu News