కీర్తి సురేశ్ చేసేది నిజంగా సాహసమే!
- 'మహానటి' డబ్బింగ్ పనులు మొదలు
- తన పాత్రకి డబ్బింగ్ చెబుతోన్న కీర్తి సురేశ్
- మే 9వ తేదీన భారీ రిలీజ్
అలాంటి సావిత్రి పాత్రను పోషించడానికి ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని చేసిన కీర్తి సురేశ్ .. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పేస్తుండటం విశేషం. ఒక రకంగా కీర్తి సురేశ్ చేసేది సాహసమేనని చెప్పాలి .. ఆమె ఆత్మస్థైర్యాన్ని అభినందించాలి. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. సమంత .. విజయ్ దేవరకొండ .. దుల్కర్ సల్మాన్ .. షాలిని పాండే ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.