అఫ్రిదీకీ ఘాటుగా సమాధానం ఇచ్చిన సచిన్ టెండూల్కర్
- సమర్థమైన నేతలు మనకు ఉన్నారు
- మనం ఏం చేయాలో బయటవాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు
- అఫ్రిదీ వ్యాఖ్యలకు సచిన్ ఘాటు స్పందన
ఇటీవల కశ్మీర్ లో 12 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనపై అఫ్రిదీ స్పందిస్తూ, కశ్మీర్ ప్రజలపై అణచివేత తీవ్రంగా ఉందని అన్నాడు. కశ్మీర్ లో రక్తం ఏరులై పారుతున్నా, ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో, అఫ్రిదీపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.