ఆ రోజు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను: శిల్పా చక్రవర్తి
- తొలినాళ్లలో నాకు తెలుగు సరిగ్గా రాదు
- అందువలన ఇబ్బందులు పడ్డాను
- కొంతమందితో మాటలు పడ్డాను
"నాకు ప్రాంమ్టింగ్ అలవాటు లేదు .. ఒకటికి రెండు సార్లు చదువుకుని చెప్పేస్తాను .. కానీ నాకు అంత సమయం ఇవ్వలేదు. డైలాగ్ పేపర్స్ కోసం కో డైరెక్టర్ ను అడిగితే ఆయన ఇవ్వకపోగా, ' ఇలాంటి వాళ్లను తీసుకొస్తారేంటండీ .. తెలుగు రానివాళ్లను మా నెత్తిమీద రుద్దుతారు. మేం షాట్స్ చూసుకోవాలా .. డైరెక్టర్ చెప్పేవి చెయ్యాలా .. నీలా భాష రానివాళ్లకు నేర్పించుకుంటూ కూర్చోవాలా?' అంటూ అంతమందిలో అరిచాడు. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను .. మరిచిపోలేకపోయాను" అంటూ చెప్పుకొచ్చారు.