Chandrababu: పార్లమెంట్ కు మొక్కడమంటే ప్రధానికి మొక్కినట్టే!: విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ మెట్లకు చంద్రబాబు మొక్కి వెళ్లడమంటే, అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానికి మొక్కినట్టేనని అభివర్ణించారు.

 రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రశ్నించగా.. దాని గురించి మాట్లాడేంత పెద్దవాళ్లం కాదని, ఇసుక, భూమి కుంభకోణాల గురించి మాట్లాడతామని అన్నారు. నోట్ల రద్దు వల్ల నల్లధనం ఉన్న వారికే ఇబ్బందని, ఇసుక మాఫియాతో సొమ్ము చేసుకున్న వారికే ఇబ్బంది అని అన్నారు. ఈశాన్య రాష్ట్రాలతో ఏపీని పోల్చడం సరికాదని, యూటర్న్ తీసుకున్న టీడీపీ అందరితోనూ మాట్లాడిస్తోందని విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
vishnu kumra raj

More Telugu News