నా డ్రీమ్ ప్రాజెక్టు రామాయణం... హాలీవుడ్ తరహాలో తీయాలని ఉంది!: ప్రభుదేవా
- నేడు ప్రభుదేవా 45వ పుట్టిన రోజు
- రామాయణం తీయాలని ఉంది
- రామాయణం సినిమాకి 500 లేదా 600 కోట్ల బడ్జెట్ అవుతుంది
ఆ సినిమాకు ఎంత లేదన్నా 500 కోట్ల నుంచి 600 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని చెప్పాడు. ఆ బడ్జెట్ కు మన సినిమాలు చేరాలంటే ఐదేళ్లు పడుతుందని అంచనా వేశాడు. అప్పుడు రామాయణాన్ని తెరకెక్కిస్తానని ప్రభుదేవా తెలిపాడు. తనకు డ్యాన్స్, సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలీదని స్పష్టం చేశాడు. ఖాళీ సమయాల్లో అప్పుడప్పుడు క్రికెట్ చూస్తానని చెప్పాడు. కాగా, ప్రభుదేవా నటించిన ‘మెర్య్కూరీ’, ‘గుళేబకావళి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, సల్మాన్ తో ‘దబాంగ్ 3’ సినిమా తీసేందుకు ప్రభుదేవా సన్నాహాలు చేస్తున్నాడు.