మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- రాఫెల్ కుంభకోణంలో రూ. 30 వేల కోట్లకు పైగా దోచుకున్నారు
- బ్యాంకింగ్ వ్యవస్థను మోదీ సర్వనాశనం చేశారు
- ముగ్గురు మోదీలు దేశాన్ని దోచుకుంటున్నారు
పెట్రోల్ ధరలను ప్రతి రోజూ సమీక్షించుకునే విధానం ద్వారా కేంద్ర ఖజానాకు లక్షల కోట్లను జమ చేసుకుంటున్నారని బుచ్చయ్య మండిపడ్డారు. ఏపీ నుంచి పన్నుల రూపంలో ఎంతో పోగేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం... తిరిగి ఏపీకి ఏమిస్తోందని ప్రశ్నించారు. గుజరాత్ లో చోటు చేసుకున్న అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకే, అన్నాడీఎంకే ఎంపీలతో లోక్ సభలో బీజేపీ ఆందోళన చేయిస్తోందని చెప్పారు. ముగ్గురు మోదీలు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.