Telugudesam: ఇదంతా కేంద్రం కావాలని చేస్తున్న నాటకమే!: టీడీపీ ఎంపీ తోట నర్సింహం

షార్ట్స్‌లో చూడండి
తమ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తోందని టీడీపీ ఎంపీ తోట నరసింహం మండిపడ్డారు. రేపు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు టీడీపీ నేతలు మరోసారి నోటీసులు అందజేశారు. టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, కేశినేని నాని ఈ నోటీసులను అందజేశారు.

అనంతరం, తోట నర్సింహం మీడియాతో మాట్లాడుతూ, ఇదంతా ప్రభుత్వం కావాలని చేస్తున్న నాటకమేనని విమర్శించారు. వైసీపీ స్వార్థప్రయోజనాల కోసమే పనిచేస్తోందని అన్నారు. టీడీపీకి చెందిన మరో నేత మురళీమోహన్ మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు తమ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.
Go Back to Shorts
Telugudesam
thota narasimham

More Telugu News