Ramcharan: ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని నేనెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదు: హీరో రామ్ చరణ్

షార్ట్స్‌లో చూడండి
ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని, కమర్షియల్ గా ఆలోచించి తానెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదని, తాను అలాంటి యాక్టర్ ని కాదని, అలాంటి ఆలోచనే ఉంటే ‘రంగస్థలం’ వచ్చేది కాదని ప్రముఖ హీరో రామ్ చరణ్ అన్నారు. హైదరాబాద్ లో ‘రంగస్థలం’ విజయోత్సవ సభ ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా విజయం కోసం చిత్ర బృందం ఎంతో కృషి చేసిందని, వారందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నాడు. సినిమా విజయం సాధించి అందరికీ పది రూపాయలు వస్తే, విజయం సాధించిన దాని కన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి విజయాలు సినీ పరిశ్రమకు కావాలని, వేసవిలో విడుదల కాబోయే చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని చరణ్ అన్నారు.
Go Back to Shorts
Ramcharan
ranghasthalam

More Telugu News