ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యే మధ్య ఆసక్తికర చర్చ

  • కళా వెంకట్రావు, నన్నపనేని, మాణిక్యాలరావుల సంభాషణ
  • ‘కొత్త శత్రువులకు నమస్కారం’ అన్న కళా వెంకట్రావు
  •  అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్న నన్నపనేని
  • ‘టీడీపీకి సోము వీర్రాజు అయితేనే సరిపోతాడు’ అంటూ మాణిక్యాలరావు చురక  
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబును పక్కనబెట్టి ఆ స్థానంలో మాణిక్యాలరావును నియమిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

‘ కొత్త శత్రువులకు నమస్కారం’ అని కళా వెంకట్రావు, ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ అని నన్నపనేని నవ్వుతూ మాణిక్యాలరావును పలకరించారు. దీనికి స్పందించిన మాణిక్యాల రావు ‘నేనేమీ ఏపీ బీజేపీ అధ్యక్షుడిని కావడం లేదు. సోము వీర్రాజు అవుతున్నారు. ఆయన్ని నేనే ప్రతిపాదించా’ అన్నారు.

ఇందుకు ప్రతిస్పందించిన నన్నపనేని ‘ఏపీ బీజేపీకి కాబోయే అధ్యక్షుడు మాణిక్యాలరావే అంటున్నారు’ అని అనడంతో,  ‘టీడీపీకి సోము వీర్రాజు అయితేనే సరిపోతాడంటూ’ మాణిక్యాలరావు నవ్వుతూ చురకంటించారు.
Go Back to Shorts
Telugudesam
BJP
ap assembly

More Telugu News