చేతిలో 500 రూపాయలతో ముంబై వచ్చాను.. సినిమా ఆపర్లు వచ్చేవరకు ఉద్యోగం చేశాను: దిశా పటానీ
- చాలా ఆడిషన్స్ కు వెళ్లేదానిని
- నా స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు
- ఉద్యోగం చేస్తూ, ఆడిషన్స్ కి వెళ్లేదానిని
ఒక సినిమా ఆడిషన్ లో తనను హీరోయిన్ గా ఎంపిక చేసి, ఆ తరువాత తన స్థానంలో వేరొక హీరోయిన్ కు అవకాశం ఇచ్చారని చెప్పింది. ముంబై వచ్చిన తొలినాళ్లలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉండేదానినని తెలిపింది. ఇంట్లో వారిని డబ్బులడగడం ఇష్టం లేక, ఉద్యోగం చేసేదానినని చెప్పింది. ఖాళీ సమయాల్లో చాలా ఆడిషన్స్ కు వెళ్లేదానినని, చాలా మటుకు టీవీ సీరియల్స్ ఆడిషన్స్ కు వెళ్లేదానినని తెలిపింది. సినిమాల్లో అవకాశం వచ్చే వరకు ఉద్యోగం చేశానని దిశా చెప్పింది.