పెద్ద మనసును చాటుకున్న సచిన్ టెండూల్కర్...... ప్రశంసించిన ప్రధాని!
- ఎంపీగా పొందిన ఆరేళ్ల జీతభత్యాలు ప్రధాని సహాయనిధికి అందజేత
- ప్రధానమంత్రి కృతజ్ఞతలతో పీఎంవో ప్రకటన విడుదల
- పదవీకాలంలో రూ.7.4 కోట్ల విలువైన 185 ప్రాజెక్టులను మంజూరు చేసిన సచిన్
"ఈ ఆలోచనా పూర్వకమైన సంకేతాన్ని ప్రధానమంత్రి గుర్తించారు. అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విరాళాలు దీనావస్థలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి" అంటూ పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సచిన్ రాజ్యసభ సభ్యుడుగా ప్రభుత్వం కేటాయించిన రూ.30 కోట్ల నిధుల్లో దేశవ్యాప్తంగా రూ.7.4 కోట్ల విలువైన 185 ప్రాజెక్టులను మంజూరు చేశారని ఆయన కార్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది. కాగా, సన్సద్ గ్రామ్ ఆదర్శ్ గ్రామ్ యోజనా పథకం కింద టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టంరాజు కండ్రిగ, మహారాష్ట్రలోని దోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.