TTD: మూడు రోజుల తరువాత తిరుమల ఆలయంలో ఆర్జిత సేవలు మొదలు!

  • మూడు రోజుల పాటు శ్రీవారికి వసంతోత్సవాలు
  • నిన్నటితో ముగిసిన వసంతోత్సవాలు
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

మూడు రోజుల తరువాత తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి నేటి నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు వైభవంగా సాగగా, భక్తుల రద్దీని, ప్రత్యేక పూజలను దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు రోజులూ సుప్రభాతం, తోమాల సేవ తదితరాలను ఏకాంతంగా నిర్వహించారు.

వసంతోత్సవాలు నిన్నటితో ముగియడంతో నేటి నుంచి యథావిధిగా సేవలు కొనసాగుతాయని టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా, ప్రస్తుతం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. ఈ ఉదయం నుంచి వేగంగా భక్తులను దర్శనానికి పంపుతుండటంతో క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న భక్తులంతా ప్రస్తుతం కంపార్టుమెంట్లలోకి వెళ్లగలిగారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 27 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారని, వీరందరికీ రాత్రి 7 గంటల్లోగా దర్శనం చేయిస్తామని అధికారులు వెల్లడించారు.

More Telugu News