జగన్ పర్యటించిన ప్రాంతాలను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన టీడీపీ ఎమ్మెల్యే

షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగిసింది. తన పాదయాత్ర సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై జగన్ విమర్శల వర్షం కురిపించారు. జగన్ విమర్శలపై శ్రీధర్ కూడా స్పందించారు. తాను అవినీతికి పాల్పడినట్టు జగన్ నిరూపిస్తే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో, తన నియోజకవర్గంలో జగన్ పర్యటించిన ప్రాంతాలను టీడీపీ కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. జగన్ పర్యటనతో తమ ప్రాంతం మలినమైపోయిందని... అందుకే శుద్ధి చేస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
jagan
pedakoorapadu
kommalapati sridhar

More Telugu News