సీబీఎస్ఈ రీఎగ్జామ్ ను బాయ్ కాట్ చేయండి: రాజ్ థాకరే పిలుపు
- ప్రశ్నాపత్రాల లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలి
- తప్పు మీరు చేసి... విద్యార్థులకు శిక్ష విధిస్తారా?
- ఎట్టి పరిస్థితుల్లోనూ రీఎగ్జామ్ కు ఒప్పుకోవద్దు
ప్రశ్నాపత్రాలను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తాము చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్షను అనుభవించాలని ప్రశ్నించారు. రీఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదని... ఇప్పుడు తల వంచితే... భవిష్యత్తులో మరెన్నో సార్లు ఇలాగే తల వంచాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అందరూ కలసికట్టుగా, ఈ సమస్యను ఎదుర్కోవాలని చెప్పారు. తాము చేసిన తప్పులకు విద్యార్థులను శిక్షించేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం... ముందు పార్లమెంటు ఉభయసభలను సజావుగా నడిపించాలని చురక అంటించారు.