ప్లేస్టోర్ నుంచి మాయమైన సిద్ధరామయ్య యాప్
- యాప్స్ నుంచి విదేశాలకు వెళ్తున్న సమాచారం
- ప్లే స్టోర్ లో కనిపించని సిద్దూ యాప్
- ఇప్పటికే యాప్ ను తొలగించిన కాంగ్రెస్
సిద్దూ యాప్ నుంచి ఓ విదేశీ కంపెనీకి సమాచారం వెళుతోందనే ఆరోపణలు వచ్చాయి. సిద్దూ యాప్ కోసం ప్లే స్టోర్ లో వెతికినా యాప్ లేదని చూపిస్తోంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వెబ్ సైట్లలో ముఖ్యమంత్రి ఫొటోలను తీసివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.