Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  మెగా హీరో వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'f 2' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో వరుణ్ కి జోడీగా మెహ్రీన్ ను ఎంపిక చేశారు.
*  వెంకటేశ్ పక్కన నయనతార మరోసారి నటించనుంది. బాబీ దర్శకత్వంలో వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం.
*  మెగా హీరో సాయి ధరం తేజ్ నటించే కొత్త సినిమా జూన్ లో సెట్స్ కి వెళుతుంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
*  సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మహానటి', ఎన్టీ రామారావు జీవితకథతో రూపొందుతున్న 'ఎన్టీఆర్' చిత్రాలకు మాటలు రాస్తున్న సాయి మాధవ్ బుర్రా మరో బయోపిక్ కు కూడా సంభాషణలు రాయనున్నారు. టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథతో రానా హీరోగా తెరకెక్కే చిత్రానికి కూడా సాయి మాధవ్ మాటలు రాయనున్నారు.
Go Back to Shorts
Mehrin
Venkatesh
Nayanatara

More Telugu News