డేటా లీక్‌.. ఆధార్‌ లీక్‌.. పరీక్ష పత్రం లీక్‌.. ఎన్నికల తేదీ లీక్‌.. చౌకీదార్‌ వీక్‌!: మోదీకి రాహుల్ చురకలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డేటా లీక్‌.. ఆధార్‌ లీక్‌.. పరీక్ష పత్రం లీక్‌.. ఎన్నికల తేదీ లీక్‌.. చౌకీదార్‌ వీక్‌!: మోదీకి రాహుల్ చురకలు

  • వివిధ అంశాలలో లీకులపై వ్యంగ్యాస్త్రాలు 
  • ట్విట్టర్ లో విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
  • అన్నింటా లీక్...చౌకీదార్ వీక్ అంటూ ట్వీట్
ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ చీఫ్ రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఫేస్‌ బుక్‌ డేటా దుర్వినియోగం, సీబీఎస్‌ఈ ప్రశ్న పత్రాల లీకేజీ, ఆధార్ డేటాపై అనుమానాల నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా ఆయన విమర్శలు చేశారు. గతంలో తాను దేశప్రధానిగా ఉండడం కంటే కాపలాదారుగా ఉన్నానని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ‘ఎన్ని లీకులు? డేటా లీక్‌! ఆధార్‌ లీక్‌! ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ పేపర్ లీక్‌! ఎన్నికల తేదీ లీక్‌! సీబీఎస్‌ఈ పరీక్ష పేపర్‌ లీక్‌! అన్నింటా లీక్‌... చౌకీదార్‌ వీక్‌’ అంటూ హిందీ, ఇంగ్లీష్‌ లలో రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. దీనికి #BasEkAurSaal (అధికారంలో ఉండేది ఇంకా ఒక్క సంవత్సరమే అనే అర్థం వచ్చేలా) అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను జోడించారు. 
Narendra Modi
Rahul Gandhi
New Delhi
Twitter

More Telugu News