కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బలరాం రాథోడ్ ను అభినందించిన మంత్రి
Add ap7am to your home Screen

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బలరాం రాథోడ్ ను అభినందించిన మంత్రి

  • గిరిపుత్రులు తలచుకుంటే అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారు
  • అందుకు, బలరాం రాథోడే నిదర్శనం
  • గిరిజనుల కోసం రెండు క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తున్నాం 
  • తెలంగాణ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి చందూలాల్
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లాకు చెందిన బలరాం రాథోడ్ ను తెలంగాణ గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  అజ్మీరా చందూలాల్ అభినందించారు. హైదరాబాద్ లోని చందూలాల్ కార్యాలయంలో ఈరోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం రాథోడ్ ను అభినందించారు. అనంతరం, చందూలాల్ మాట్లాడుతూ, గిరిపుత్రులు తలచుకుంటే అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారని, వారికి సరైన ప్రోత్సాహం, తగిన శిక్షణ అందిస్తే ఎలాంటి కార్యాన్ని అయినా సాధిస్తారని, అందుకు, బలరాం రాథోడే నిదర్శనమని చెప్పారు. విద్యార్థి దశలోనే గిరిజనులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, వారిని క్రీడల్లో ప్రోత్సహించే నిమిత్తం రెండు క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిరిజనులకు ఆర్చరీలో శిక్షణ ఇచ్చేందుకు ఐటీడీఏ పరిధిల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, తమ శాఖ తరపున గిరిజన క్రీడాకారులకు అన్ని విధాలా తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. కేవలం, ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారికి తగిన వనరులు సమకూర్చాలని చందూలాల్ సూచించారు.
Telangana
balaram rathod
minister chandulal

More Telugu News