నితీష్ కుమార్ పని ముగిసిపోయినట్టే: రైల్వే స్టేషన్ లో లాలూ ప్రసాద్ యాదవ్
- బీహార్ ను బీజేపీ రావణకాష్టంలా మార్చేసిందన్న లాలూ
- నితీష్ పని అయిపోయిందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్న ఆర్జేడీ అధినేత
- వైద్య చికిత్స కోసం ఢిల్లీ చేరుకున్న లాలూ
బీహార్ లోని భాగల్పూర్ లో ఈనెల 17న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శాశ్వత్ నాయకత్వంలో భజరంగ్ దళ్, ఆరెస్సెస్ నిర్వహించిన ఓ ఊరేగింపు సందర్భంగా ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి. హింసను రెచ్చగొట్టినట్టు అర్జిత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది.