ఐసీఐసీఐకి భారీ పెనాల్టీ వేసిన ఆర్బీఐ!
- నిబంధనలు పాటించని ఐసీఐసీఐ
- రూ. 58.90 కోట్ల జరిమానా విధించిన ఆర్బీఐ
- కస్టమర్ల లావాదేవీలపై ప్రభావముండదని వ్యాఖ్య
సెక్యూరిటీ బాండ్ల విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, బ్యాంకు ఈ నిబంధనలను పాటించలేదని వెల్లడించింది. ఈ జరిమానా కారణంగా లావాదేవీల వ్యాలిడిటీ, లేదా బ్యాంకు తమ కస్టమర్లతో చేసుకున్న ఒప్పందాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలిపింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని సెక్షన్ 47 ఏ (1) (సీ), రెడ్ విత్ సెక్షన్ 46 (4) (ఐ)కింద ఈ జరిమానా విధిస్తున్నట్టు ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ జోస్ కే ఖట్టూర్ ఈ నోటీసుల్లో వెల్లడించారు.