తెలుగులో ట్వీట్ చేసిన అమితాబ్ బచ్చన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో ట్వీట్ చేసిన అమితాబ్ బచ్చన్

  • ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న అమితాబ్
  • 'సైరా' చిత్ర షూటింగ్ లో బిగ్ బీ
  • తన లుక్ ను విడుదల చేసిన అమితాబ్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు. చిరంజీవి కోరినందునే తాను ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు అమితాబ్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

నిన్న బుధవారం నాడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన అమితాబ్, నేటి నుంచి 'సైరా' షూటింగ్ లో పాల్గొంటారు. 'సూపర్ స్టార్ చిరంజీవి... అదే ఫ్రేమ్ లో ఒక గౌరవం ఉండాలి' అని అమితాబ్ ట్వీట్ చేశారు. సినిమాలో తన లుక్ కు సంబంధించి ఓ ఫొటోను కూడా ఉంచారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తరహాలో అమితాబ్ కనిపిస్తుండటం విశేషం. గత అర్ధరాత్రి దాటిన తరువాత ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Sairaa
Chiranjeevi
Amitabh Bachchan
Hyderabad

More Telugu News