ఇలా తింటే ఆరోగ్యం మీ వెంటే... నటి శిల్పాషెట్టి హెల్త్ చిట్కా!
Add ap7am to your home Screen

ఇలా తింటే ఆరోగ్యం మీ వెంటే... నటి శిల్పాషెట్టి హెల్త్ చిట్కా!

  • మొక్క నుంచి వచ్చే ఆహారమే తినాలని సూచన
  • దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో అప్‌లోడ్
  • ఇలాంటి చిట్కాలు ఇస్తుండాలని నెటిజన్ల రిక్వెస్ట్
బాలీవుడ్ నటి శిల్పాషెట్టి సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయని తెలియగానే తనకున్న పాప్యులారిటీని ఉపయోగించుకుని వ్యాపారం వైపు దృష్టి మళ్లించింది. సుగంధ పరిమళాల బిజినెస్‌తో పాటు యోగాసనాల పరంగా కూడా ఆమె ఫ్యామస్ అయిపోయింది. ముఖ్యంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టమంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె పలు చిట్కాలు ఇస్తోంది.

ఆరోగ్యకరమైన ఆహారం విషయానికొస్తే, ఏది నిజం, ఏది కృత్రిమం అన్న సంగతిని ఎప్పుడూ గుర్తించుకోవాలని ఈ ముద్దుగుమ్మ సూచిస్తోంది. ఏదైనా ఆహారం మొక్క నుంచి వస్తే దానిని కళ్లు మూసుకుని తినేయొచ్చని, అదే ప్లాంట్ (ఉత్పత్తి కేంద్రం) నుంచి వస్తే మాత్రం దానిని తినవద్దని ఆమె చెబుతోంది. దీనికి సంబంధించి ఓ ఫొటోని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇలాంటి ఆరోగ్య సూత్రాలు తమకు అప్పుడప్పుడు చెబుతూ ఉండాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
Shilpa Shetty
Bollywood
Health
Yoga

More Telugu News