Michael Vaughn: బాల్ ట్యాంపరింగ్ వివాదం...మైకేల్ వాన్‌ ట్వీట్‌కి వార్నర్ భార్య ఘాటుగా రీట్వీట్!

షార్ట్స్‌లో చూడండి
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్ల 'బాల్ ట్యాంపరింగ్' వివాదం ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్-ఆసీస్ స్టార్ క్రికెటర్ వార్నర్ భార్య క్యాండైస్ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. సోషల్ మీడియాలో తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ కొందరు ఆసీస్ క్రికెటర్లు ఫిర్యాదు చేయడాన్ని వాన్ తప్పుబట్టాడు.

"ఇంత జరిగాక కూడా తమను వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటూ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫిర్యాదు చేస్తుండటం నాకు నవ్వు తెప్పిస్తోంది" అంటూ వాన్ ట్వీట్‌ చేశాడు. దీనికి క్యాండైస్ ఘాటుగా రీట్వీట్ చేసింది. "నీకు నవ్వు వస్తోందంటే నాకు ఆనందంగానే ఉంది. కానీ, ఇదే పరిస్థితి రేపు నీ భార్యాపిల్లలకు వచ్చినా నువ్వు ఒప్పుకుంటావన్నమాట" అంటూ క్యాండైస్ సీరియస్‌గా రీట్వీట్ చేసింది.
Go Back to Shorts
Michael Vaughn
England
Warner
Ball Tampering

More Telugu News