నాని .. రష్మిక మందనలపై ఇంట్రెస్టింగ్ సీన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని .. రష్మిక మందనలపై ఇంట్రెస్టింగ్ సీన్స్

  • మల్టీ స్టారర్ మూవీతో శ్రీరామ్ ఆదిత్య 
  • హీరోలుగా నాగార్జున .. నాని
  • మియాపూర్ మెట్రో స్టేషన్లో చిత్రీకరణ      
మొదటి నుంచి కూడా నాగార్జున వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక కథలో విషయం ఉండాలే గాని మల్టీస్టారర్ సినిమాలను కూడా చేస్తూ వచ్చారు. అదే విధంగా ఆయన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన ఒక కథానాయికగా నటిస్తోంది.

'ఉగాది' రోజున ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ను ఆరంభించారు. నాని .. రష్మిక మందన .. సంపూర్ణేష్ బాబుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో, ఆ షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్ .. మియాపూర్ మెట్రో స్టేషన్లో చిత్రీకరించిన ఇంట్రెస్టింగ్ సీన్స్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి, మణిశర్మ అందిస్తోన్న సంగీతం ప్రధానమైన బలంగా నిలుస్తుందని చెబుతున్నారు.    
nagarjuna
nani
rashmika

More Telugu News