Cricket: జట్టంతా ట్యాంపరింగ్ కు పాల్పడడం గురించి తొలిసారి వింటున్నా!: కపిల్ దేవ్

  • క్రికెట్ లో ఒక ఆటగాడు టాంపరింగ్ కు పాల్పడడం సాధారణమే
  • జట్టంతా నేరంలో భాగమవ్వడం ప్రమాదకరం
  • గతంలో ఎప్పుడూ ఇలాంటి వార్త వినలేదు

క్రికెట్ లో ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌ కు పాల్పడటం మామూలేనని భారత్ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. క్రికెట్ ప్రపంచాన్ని పట్టికుదిపేస్తున్న టాంపరింగ్ పై ఆయన స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టు మొత్తం టాంపరింగ్‌లో పాలుపంచుకుందన్న వార్త ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు.

సాధారణంగా బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ ఆటగాడు దొరికిపోతే ఐసీసీ చర్యలు తీసుకోవడం సర్వసాధారణమని పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉందని, ఒక జట్టంతా టాంపరింగ్ కు పాల్పడిందని, ఇది క్రికెట్ కు ప్రమాదకరమైన పరిణామనని పేర్కొన్నాడు. గతంలో తానెప్పుడూ ఇలాంటి వార్త వినలేదని తెలిపాడు. ఒక నేరంలో జట్టు మొత్తం భాగం కావడం గురించి తొలిసారి వింటున్నానని కపిల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

More Telugu News