akhil: అఖిల్ మూవీలో గెస్టుగా దుల్కర్ సల్మాన్?

షార్ట్స్‌లో చూడండి
అఖిల్ మూడవ సినిమా నిన్ననే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యాడు. దాంతో ఆయన ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేయనున్నాడనే టాక్ వినిపించింది. అందువల్లనే ఆయన ఈ సినిమా లాంచ్ కి వచ్చాడని చెప్పుకున్నారు.

 అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. అఖిల్ కి .. దుల్కర్ సల్మాన్ కి మధ్య మంచి స్నేహం ఉందట. ప్రస్తుతం 'మహానటి' సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం కోసం ఆయన హైదరాబాద్ లోనే వున్నాడు. అఖిల్ ఆహ్వానం మేరకు ఆయన ఈ సినిమా పూజా కార్యక్రమాలకు హాజరయ్యాడనీ .. ఆయన ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేయడం లేదని అంటున్నారు. 
Go Back to Shorts
akhil
dulquer

More Telugu News