అటెన్షన్ టు ప్యాసింజర్స్....శతాబ్ది రైళ్లలో ప్రయాణం ఇక భారం కాదు...!
- శతాబ్ది రైళ్ల ఛార్జీలను తగ్గించనున్న రైల్వే శాఖ
- బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ఛార్జీల తగ్గింపుతో సత్ఫలితాలు
- ఇతర మార్గాలకు విస్తరిస్తామని వెల్లడి..దేశవ్యాప్తంగా 45 శతాబ్ది రైళ్లు
దేశవ్యాప్తంగా 45 వరకు శతాబ్ది రైళ్లున్నాయి. వీటిలో ఢిల్లీ-అజ్మీర్, చెన్నై-మైసూర్ మధ్య నడిచే రైళ్లలో కొన్ని స్టేషన్ల మధ్య గతేడాది ప్రయోగాత్మకంగా ఛార్జీలను తగ్గించారు. కాగా, బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ప్రయాణికుల శాతం బాగా తక్కువగా నమోదయ్యేది. ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపేవారు. ఈ విషయం తెలుకున్న రైల్వే శాఖ... ఈ స్టేషన్ల మధ్య శతాబ్ది రైళ్ల ఛార్జీలను బస్సు ఛార్జీలతో సమానం చేసింది. దీంతో బెంగళూరు-మైసూరు స్టేషన్ల మధ్య ప్రయాణికుల సంఖ్య 63 శాతం మేర పెరిగింది. ఈ కారణంగా ఈ పథకాన్ని మరిన్ని మార్గాల్లో విస్తరించడానికి రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది.