వాళ్లు బీజేపీ మాట వింటారే తప్ప, పవన్ మాట ఎందుకు వింటారు?: వర్ల రామయ్య

  • పవన్ కల్యాణ్ కు రాజకీయ అవగాహన లేదు
  • ‘జనసేన అధికార ప్రతినిధుల్లో బీజేపీ నాయకులు ఇద్దరున్నారు
  •  నాటకాలాడుతున్న వైసీపీ గంగలో కలవడం ఖాయం
  •  జగన్ ని అడ్డుపెట్టుకుని బీజేపీ డ్రామాలాడాలని చూస్తోంది : వర్ల
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. రాజకీయ అవగాహన లేని పవన్ స్థాపించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇద్దరు బీజేపీ నాయకులు ఉన్నారని, బీజేపీ చెప్పిన మాటలే వాళ్లు వింటారు తప్ప, పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను వాళ్లెందుకు వింటారని అన్నారు. నాడు పీఆర్పీ స్థాపించిన చిరంజీవి కొన్ని సీట్లయినా గెలిచారని, పవన్ కల్యాణ్ అంతకన్నా ముందే తన దుకాణం సర్దేస్తాడని జోస్యం చెప్పారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వైసీపీ నేతలు, ప్రధాన మంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నాటకాలాడుతున్న వైసీపీ గంగలో కలిసిపోవడం ఖాయమని, జగన్ ని అడ్డుపెట్టుకుని బీజేపీ డ్రామాలాడాలని చూస్తోందని వర్ల రామయ్య మండిపడ్డారు.
Go Back to Shorts
Pawan Kalyan
varla ramaiah

More Telugu News