ప్రజాస్వామ్యాన్ని కాషాయ పార్టీ అపహాస్యం చేసిందనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం!: మాయావతి
- భవిష్యత్తులోనూ ఎస్పీ-బీఎస్పీ పొత్తు కొనసాగుతుందని ప్రకటన
- మోదీ, అమిత్ షా తమను ఒక్క ఇంచు కూడా కదపలేరని వ్యాఖ్య
- ప్రజల్లో విశ్వాసముంటే గోరఖ్ పూర్, ఫూల్ పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఓడిపోతుందని విమర్శ
ప్రజాస్వామ్యాన్ని కాషాయ పార్టీ అపహాస్యం చేసిందని చెప్పడానికి తాజా రాజ్యసభ ఎన్నికల ఓటింగే నిదర్శమని ఆమె దుయ్యబట్టారు. బీజేపీ ఓటమి భయంతో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందని ఆమె ఆరోపించారు. ప్రజలు బీజేపీని విశ్వసించి ఉంటే గోరఖ్ పూర్, ఫూల్ పూర్ లోక్సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఓడిపోతుందని ఆమె ప్రశ్నించారు. యూపీ రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం పది సీట్లకు బీజేపీ 9 కైవసం చేసుకోగా ఎస్పీ ఒక సీటును గెలుచుకున్న సంగతి తెలిసిందే.