మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి
- నిన్ననే విడుదలైన 'నీదీ నాదీ ఒకే కథ'
- వేణు ఊడుగులకు మంచి పేరు
- తదుపరి చిత్రం సాయిపల్లవితో
ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 'నీదీ నాదీ ఒకే కథ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్ గా ఈ దర్శకుడు సాయిపల్లవిని కలిసి ఒక లైన్ వినిపించాడట. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా చేయడానికి ఆమె అంగీకరించిందని అంటున్నారు. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వేణు ఊడుగుల వున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.