అనంత్ నాగ్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది
Add ap7am to your home Screen

అనంత్ నాగ్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది

  • శిస్త్రాగమ్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన భద్రతా సిబ్బంది
  • ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు..భద్రతా సిబ్బందిపై కాల్పులు
  • ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అనంత్ నాగ్ లోని శిస్త్రాగమ్ గ్రామంలో ఈ రోజు ఉదయం భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ చేపట్టింది. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న ముష్కరులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో, భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు.
Jammu And Kashmir
ananthnag

More Telugu News