CPI Narayana: మోదీకి వ్యక్తిగత కక్ష ఉంటే చంద్రబాబును జైల్లో పెట్టుకోవాలి: సీపీఐ నారాయణ

షార్ట్స్‌లో చూడండి
'చంద్రబాబునాయుడుపై మోదీకి వ్యక్తిగత కక్ష ఉంటే బాబును జైల్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ, తెలుగు ప్రజలపై కక్ష ఎందుకు సాధిస్తున్నారు? ఏపీలో బీజేపీకి శాశ్వతంగా పునాదులు లేకుండా పోయే పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు' అన్నారు సీపీఐ నేత నారాయణ. కాగా, ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఆయన విమర్శలు చేశారు.

'కేసీఆర్ లాంటి వాళ్లు కూడా థర్డ్ ఫ్రంట్ పెడతామని అంటున్నారు! థర్డ్ ఫ్రంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామంటారు, అక్కడికి వెళ్లి బీజేపీని సపోర్టు చేస్తారు! కేంద్రంలో ఏమో కేసీఆర్ శిఖండి పాత్ర..తెలంగాణకు వచ్చేసరికి అర్ధనారీశ్వర పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత వైఖరి తెలంగాణలో నడుస్తోంది' అన్నారు నారాయణ.
Go Back to Shorts
CPI Narayana
Narendra Modi

More Telugu News