విష్ణుకుమార్ రాజుకు కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్
- ఐటీ కంపెనీలకు భూముల అప్పగింతపై విష్ణు ఆరోపణలు
- ఐటీ నిబంధనల మేరకే కేటాయింపులు జరుగుతున్నాయన్న లోకేష్
- ఐటీ సంస్థను ఎవరు తెచ్చినా భూములిస్తామన్న మంత్రి
ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.