Donald Trump: చైనా వస్తువులతో అమెరికాలో 20 లక్షల ఉద్యోగాలు పోయాయి: వైట్ హౌస్

  • 370 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
  • ప్రతీ బిలియన్ డాలర్లకు 6,000 ఉద్యోగాల నష్టం
  • చైనా అనైతిక వాణిజ్య విధానాలను అనుసరిస్తోందన్న వైట్ హౌస్

చైనా చౌక ఉత్పత్తులు అమెరికాను కలవరపెడుతున్నాయి. అందుకే చైనా ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలకు తెరతీసింది. చైనాతో అమెరికా వాణిజ్య లోటు 370 బిలియన్ డాలర్లకు చేరినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దీంతో చైనా నుంచి దిగుమతి అవుతున్న 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్నులను సమం చేయాలని అధ్యక్షుడు ట్రంప్ అధికారులను ఆదేశించారు.

కేవలం చైనా దిగుమతుల కారణంగా దేశంలో వేలాది పరిశ్రమలు మూతపడి, 20 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయినట్టు అమెరికా ఆరోపిస్తోంది. చైనా అనైతిక వాణిజ్య విధానాలను అనుసరిస్తోందంటూ  విమర్శలు గుప్పించింది. ‘‘ప్రతీ బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఫలితం 6,000 ఉద్యోగాల నష్టం. ఓ అంచనా మేరకు దీనివల్ల చైనాలో 2 మిలియన్ (20లక్షలు) ఉద్యోగాలు పెరగ్గా, అమెరికాలో ఆ మేరకు తగ్గాయి’’ అని అధ్యక్ష కార్యాలయం తెలిపింది

More Telugu News