ashok: మరో ఆసక్తికరమైన కథా నేపథ్యంతో 'భాగమతి' డైరెక్టర్

  • 'భాగమతి'తో హిట్ కొట్టిన దర్శకుడు 
  • ఈ సారి యథార్థ సంఘటనపై దృష్టి
  • స్క్రిప్ట్ వర్క్ పై కసరత్తు  

ఈ మధ్య కాలంలో దర్శకులు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని, తమ ప్రత్యేకతను చాటుకోవడానికి మరింత ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. సబ్ మెరైన్ నేపథ్యంలో 'ఘాజీ' సినిమా చేసిన సంకల్ప్ రెడ్డి .. అంతరిక్షం నేపథ్యంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ట్రావెన్ కోర్ రాజవంశీకులకు సంబంధించిన కథతో మరో దర్శకుడు రంగంలోకి దిగాడు.

అలాగే బ్రిటీష్ వారికి సంబంధించిన ఒక కథా వస్తువును దర్శకుడు జి.అశోక్ ఎంచుకున్నాడు. 'కోమగటమరు' అనే జపనీస్ స్టీమ్ షిప్ ఓ బ్రిటీష్ రాజు అధీనంలో ఉండేది. ఆ షిప్ లో భారతీయులు బానిసలుగా ఉండేవారు. 1914లో ఈ షిప్ ద్వారా ఆ బ్రిటీష్ రాజు కెనడాలోకి ప్రవేశించాలని చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. ఇలా యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.        

More Telugu News