టీడీపీ అవిశ్వాసంపై టీఆర్ఎస్ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు
- కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ తమను సంప్రదించలేదని వ్యాఖ్య
- 2014లో బీజేపీతో పొత్తు సందర్భంగా కూడా తమను సంప్రదించలేదని విమర్శ
- తెలంగాణకు అన్యాయం జరిగితే టీడీపీ ఎప్పుడైనా మాట్లాడిందా? అని సూటి ప్రశ్న
అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విషయంలో తమ నాయకుడు కేసీఆర్‌ను టీడీపీ సంప్రదించిందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే టీడీపీ ఎప్పుడైనా మాట్లాడిందా? అని కూడా ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ తమతో ఎందుకు కలవడం లేదో చెప్పాలని ఆయన నిలదీశారు.