‘అత్తారింటికి దారేది’ సీడీని తీసి అవతల పారేశా!: వర్ల రామయ్య
Add ap7am to your home Screen

‘అత్తారింటికి దారేది’ సీడీని తీసి అవతల పారేశా!: వర్ల రామయ్య

  • పవన్ కల్యాణ్ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు
  • ‘అత్తారింటికి దారేది’ సీడీని నా కారులో నుంచి తీసి బయట పారేశా
  • చంద్రబాబు ప్రభుత్వంపై, లోకేశ్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో : వర్ల రామయ్య
‘అత్తారింటికి దారేది’ సినిమా సీడీని మొన్ననే బయట పారేశానని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. నా కారులో కూడా ఈ సినిమా సీడీ ఉంటుంది. ఏంటీ ఈ కుర్రాడు (పవన్ కల్యాణ్) ఇలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడనుకుని, ‘అత్తారింటికి దారేది’ సీడీని నా కారులో నుంచి తీసి బయట పారేశాను.

నువ్వు (పవన్ కల్యాణ్) చేసిన వ్యాఖ్యలు సరైనవే అయితే ఆ సీడీని ఉంచుకునేవాడిని. లోకేశ్ పై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత ‘వాళ్లెవరో చెప్పారు..అక్కడ విన్నా..ఇక్కడ విన్నా’ అని మాట్లాడావు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వంపై తొందరపడి చేసిన వ్యాఖ్యలనూ వెనక్కి తీసుకుంటానని, చంద్రబాబు వెంటే నడుస్తా, మోదీ మెడలు వంచైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని నువ్వు (పవన్ కల్యాణ్) చెప్పాలి. మిస్టర్ పవన్ కల్యాణ్..ఇప్పటికైనా నీ దగ్గర వాస్తవాలు, ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప, గాలివి పోగుజేసి మాట్లాడొద్దు’ అని వర్ల రామయ్య హితవు పలికారు.
Pawan Kalyan
varla ramaiah

More Telugu News