amaranath reddy: కొందరు ఆడిస్తోన్న నాటకంలో పవన్ కల్యాణ్ భాగస్వామి: ఏపీ మంత్రి అమరనాథ్‌రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోజుకోమాట మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అని అన్న పవన్.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని అన్నారని తెలిపారు. తాజాగా మళ్లీ మాట్లాడుతూ ప్రత్యేక హోదానా లేక ప్యాకేజీనా అన్న విషయం కాదని ఆర్థిక సాయం కావాలని పవన్ అంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పరిణతితో మాట్లాడుతున్నారా? లేక ఎవరైనా రాసిచ్చిన స్క్రిప్టు చదువుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కొందరు ఆడిస్తోన్న నాటకంలో ఆయన భాగస్వామి అవుతున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు.

అసలు పవన్ కల్యాణ్ లాంటి నాయకుల అవసరం రాష్ట్రానికి లేదని, అటువంటి వారితో రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతుందని అమరనాథరెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ మరోవైపు బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నట్లు కనపడుతోందని అన్నారు. 
Go Back to Shorts
amaranath reddy
Pawan Kalyan
Telugudesam

More Telugu News