sharad pawar: పొగాకు, సుపారీ తినడం వల్ల నా పళ్లు తీసేశారు: శరద్ పవార్

షార్ట్స్‌లో చూడండి
40 ఏళ్ల క్రితం తనను ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. నోటి కేన్సర్ ను రూపుమాపేందుకు ఏర్పాటైన ‘ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ మిషన్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పొగాకు, సుపారీకి అలవాటు పడి చాలా తప్పు చేశానని అన్నారు.

కేన్సర్ నుంచి బయటపడేందుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆపరేషన్ తనను చాలా బాధించిందని ఆయన చెప్పారు. సర్జరీ సమయంలో తన పళ్లు తీసేశారని అన్నారు. దానివల్లే తాను ఇప్పటికీ నోరు తెరవలేకపోతున్నానని ఆయన చెప్పారు. మాట్లాడేందుకు, ఆహారం తీసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ యువత దురలవాట్లకు లోనవుతోందని, అలాంటి వారిలో అవగాహన తెచ్చేందుకు సహాయపడతానని ఆయన చెప్పారు.
Go Back to Shorts
sharad pawar
ncp
ncp president

More Telugu News